హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరు మండలంలో 11 పంచాయతీలు ఏకగ్రీవం

కడప: ప్రొద్దుటూరు మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను 11 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన తాళ్లమాపురం, కల్లూరు, ఉప్పరపల్లె, నంగనూరుపల్లె పంచాయతీల్లో మాత్రమే సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 139 వార్డులు కూడా ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు.