హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలి'

VZM: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో NHపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌. రాంసుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా ఎస్పీ దామోదర్‌తో కలిసి ఇటీవల ఐదుగురి ప్రాణాలు బలిగొన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నారుపేట బే పార్కింగ్‌ను తక్షణమే అందుబాటులోకి తెచ్చి, లారీలు రహదారిపై నిలపకుండా చర్యలు తీసుకోవాలన్నారు.