NTR: జిల్లాలో రేపు ఉదయం జరగనున్న 2వ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాజశేఖర్ బాబు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలకు, ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఎన్నికల అనంతరం అందరూ సోదరభావంతో మెలగాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలి: కమిషనర్


