హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు.. సమాజంలో సమానత్వం, విద్యాభివృద్ధి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.