మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు స్వాగతిస్తున్నామని యూపీ మాజీ సీఎం మాయావతి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక రిజర్వేషన్ ఉంటే చారిత్రాత్మక నిర్ణయమే అని పేర్కొన్నారు. అలాగే, డీలిమిటేషన్ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజలు మంచి వ్యక్తులనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
మహిళా రిజర్వేషన్లపై మాయావతి కీలక వ్యాఖ్యలు


