హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీజనల్ వ్యాధుల నివారణ, పరిశుభ్రత పై అవగాహన

కృష్ణా: మచిలీపట్నం రైలుపేట పరిధిలోని బుట్టాయపేట 1 సచివాలయ ప్రాంతం, మసీదు వీధిలో ఈరోజు ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్లు బి.రాఘవేంద్రరావు, భట్రాజు సూరిబాబు, ఏఎన్‌ఎం విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.