హైదరాబాద్: 28°C
వార్తలు

మెరుగుపడుతున్న శరద్ పవార్ ఆరోగ్యం

ఎన్సీపీ అధ్యక్షుడు, సీనియర్ నేత శరద్ పవార్ (85) ఆరోగ్యం మెరుగుపడింది. డీహైడ్రేషన్ సమస్యతో గురువారం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆయనను ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపాయి.