హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదం.. బీజేపీ ఎంపీకి గాయాలు

ఛత్తీస్‌గఢ్ బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మీ వర్మ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఖరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగోలి సమీపంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ వర్మతో పాటు ఆమె కుమారుడు, గన్‌మన్, డ్రైవర్ గాయపడ్డారు. ఎంపీ చేతికి తీవ్రగాయం కావడంతో రాయ్‌పూర్ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.