హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కండ్రిగలో బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి

TPT: పిచ్చాటూరు (M) సిద్దిరాజులకండ్రిగలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బ్రిడ్జికి అవతలి వైపున 2,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో మూడు నెలల పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులు, ఉద్యోగాలకు వెళ్లేవారు, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.