E.G: రాజమండ్రి దానవాయిపేటలోని కర్ణాటక బ్యాంక్ ఎదుట వీధిలో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. రోడ్డుపై ఎక్కడికక్కడ వ్యర్థాలు పడివుండటంతో పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసనతో అటుగా రాకపోకలు సాగించలేకపోతున్నామని వాపోతున్నారు. పారిశుద్ధ్య అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
దానవాయిపేటలో చెత్త కుప్పల సమస్య


