AP: తిరుమలలో పోగొట్టుకున్న 60 గ్రాముల బంగారు ఆభరణాలను టీటీడీ సిబ్బంది గుర్తించి భక్తుడికి తిరిగి అప్పగించారు. మదనపల్లెకు చెందిన జి. మహేష్ శుక్రవారం సాయంత్రం ఆభరణాలు పోగొట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 52 గ్రాముల బంగారం, 8 గ్రాముల ఉంగరాన్ని గుర్తించారు. శనివారం ఉదయం 6.30 గంటలకు మహేష్‌కు అందజేశారు. టీటీడీ సిబ్బంది పనితీరుపై భక్తులు ప్రశంసలు కురిపించారు.
భక్తి
తిరుమలలో పోయిన 60 గ్రా. బంగారం!


