హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో భక్తుల రద్దీ

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న 63,645 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.98 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే 28,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది.