ప్రకాశం: ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహాదేవపురం గ్రామ సర్పంచ్ దామా శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ మద్దతు తో నిలిచిన ఆయన, గ్రామ అభివృద్ధికి రూ. 99 లక్షలు ఇస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఏకాభిప్రాయానికి వచ్చారు. గత రెండేళ్లుగా జర్మనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసులు ఎన్నికల కోసం స్వగ్రామానికి వచ్చారు. నామినేషన్ల ఉపసంహరణతో ఆయన ఏకగ్రీవమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మహాదేవపురం సర్పంచ్ ఏకగ్రీవం


