హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాప్తాడు ఘటన ప్రసారంపై కమిషన్ సీరియస్

ATP: రాప్తాడు ఘటనలో బాధిత బాలికకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేసిన విషయంపై సాక్షి టీవీకి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. బాలిక గుర్తింపును వెల్లడించేలా పేరు, ముఖచిత్రం, పాఠశాల, గ్రామం, ఆస్పత్రి వివరాలు ప్రసారం చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. సంబంధిత వీడియోలు, ఫొటోలను డిజిటల్ మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది.