హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి..?

శరద్ పవర్ కుమార్తె, NCP (SP) ఎంపీ సుప్రియా సూలేకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ నిన్న ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుకు NCP (SP) మద్దతు నేపథ్యంలో తన కుమార్తెకు మంత్రి పదవి ఇవ్వాలని శరద్ పవార్ షరతు పెట్టినట్లు సమాచారం.