హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నారు'

PLD: పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ గడువు ముగిసినా అభ్యర్థుల తుది జాబితా ప్రకటించకపోవడంపై మాజీ మంత్రి విడదల రజిని అధికారుల తీరును తప్పుబట్టారు. బొప్పూడి నామినేషన్ కేంద్రం వద్ద అధికారులను నిలదీసిన ఆమె, నిబంధనలు ఉల్లంఘిస్తూ వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు.