హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాంగే నగర్‌లో డ్రైనేజీ దుర్వాసన.. స్థానికుల అవస్థలు

ఏలూరు: జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగే నగర్, అంబేద్కర్ సెంటర్ సచివాలయం పక్కన గత వారం రోజులుగా డ్రైనేజీ బ్లాక్ కావడంతో మురుగునీరు రోడ్డుపైకి ప్రవహిస్తోంది. తీవ్ర దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీని శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.