PPM: పాలకొండ పట్టణంలోని వడమ మార్గంలో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. కాలువలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తోంది. ఈ రహదారిపై వడమ, అన్నవరం, అంపిలి తదితర గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తుండటంతో దుర్వాసన, మురుగునీటి సమస్యతో అవస్థలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు


