హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రజాప్రతినిధులు

ATP: గుమ్మగట్ట మండలం కలుగోడులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు టీడీపీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. విజయమ్మ కలుగోడు ఎంపీటీసీగా, ఆమె భర్త కాలువ సన్నన్న పులకుంట ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా విజయమ్మ సోదరి, తోడికోడలు కాలువ వసంతమ్మ కలుగోడు సర్పంచ్‌గా విజయం సాధించారు. గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని వారు తెలిపారు.