హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30న పెన్షన్ పంపిణీకి కలెక్టర్ ఆదేశాలు

ఏలూరు: NTR భరోసా డిసెంబర్ నెల పెన్షన్లు నవంబర్ 30వ తేదీన చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. NTR భరోసా పెన్షన్ల పంపిణీపై మున్సిపల్ కమిషనర్లు, MPDOలతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో డిసెంబర్ నెలలో 2,51,883 మందికి 111.82 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామన్నారు