హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెట్టును ఢీకొన్న ఎంపీడీవో కారు

ATP: విధి నిర్వహణకు వెళ్తుండగా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట వద్ద ఎంపీడీవో మమతాదేవి ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆమె స్వయంగా కారు నడుపుకుంటూ నార్పలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.