హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CPRతో వ్యక్తికి పునర్జన్మ

ATP: జిల్లాలోని పీటీసీ ప్రాంగణంలో షటిల్ ఆడుతున్న స్వామి అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అక్కడే ఉన్న ఇద్దరు వాకర్స్ స్పందించి CPR నిర్వహించడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. అనంతరం పోలీసులు అంబులెన్స్‌లో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడిన వాకర్స్, పోలీసులపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.