హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30న సామాజిక పింఛన్ల పంపిణీ

కడప: డిసెంబరు నెలకు సంబంధించి ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను ఈ నెల 30న పంపిణీ చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆరోజే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆరోజు అందుబాటులో లేని వారికి డిసెంబరు 1న అందించనున్నారు. జిల్లాలో 2,74,831 మంది లబ్ధిదారులకు రూ.120.93 కోట్ల నిధులు మంజూరయ్యాయి.