హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంపై కేతిరెడ్డి ఫైర్

SS: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పెట్రోల్ బాటిళ్లతో దాడి జరిగిందని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి నేతకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.