హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని ముగ్గురు కార్మికుల దుర్మరణం

ATP: కర్ణాటకలోని కనంపల్లి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మడకశిర మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్, మేఘేశ్, నరసింహమూర్తి మృతి చెందారు. తాపీ పనులు ముగించుకుని ఎక్స్‌ఎల్ వాహనంపై ఇంటికి వెళ్తుండగా దేవరహట్టి నుంచి పావగడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న మాలింగప్ప, తిప్పేస్వామి, మాలింగ గాయపడ్డారు. కారు ప్రయాణికులు మద్యం సేవించినట్లు సమాచారం.