హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 30న మెగా రక్తదాన శిబిరం

VZM: గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30న గ్రంథాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ వ్యవస్థాపకుడు అబ్దుల్ రవూఫ్ తెలిపారు. యువత, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒక్కో దాత రక్తంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.