హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీ సంఘాల ఆధ్వర్యంలో 'ఛలో రామ్ లీలా'

ఢిల్లీలో ఇవాళ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఛలో రామ్ లీలా కార్యక్రమం నిర్వహించనున్నారు. కులగణనలో ఓబీసీ కాస్ట్ కోడ్ కేటాయించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, కులాల వారీగా సమగ్ర జనగణన చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ఓబీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.