హైదరాబాద్: 28°C
వార్తలు

తల్లి కులంతో పిల్లలకు క్యాస్ట్ సర్టిఫికెట్?

పిల్లలకు తల్లి కులం ఆధారంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. తల్లి వద్ద పెరిగే పిల్లలు, విడాకులు, దత్తత, సింగిల్ పేరెంట్ తదితర కేసుల్లో చాలా కీలకమని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాల్లో తండ్రి కులం కాకుండా రాజ్యాంగ సూత్రాలను అతిక్రమించకుండా తల్లి సామాజిక వర్గం పిల్లలకు వర్తించేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని తెలిపింది.