హైదరాబాద్: 28°C
వార్తలు

రెండోరోజు బీజేపీ జాతీయ పదాధికారుల కీలక భేటీ

ఢిల్లీలో ఇవాళ రెండోరోజు బీజేపీ జాతీయ పదాధికారుల కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ హాజరుకానున్నారు. రాష్ట్ర అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు కూడా పాల్గొంటారు. 2027 ఎన్నికల రోడ్ మ్యాప్‌పై బీజేపీ కసరత్తు చేస్తోంది. యూపీ, పంజాబ్ సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి ప్రచారంపై దృష్టి సారించనున్నారు.