హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు తిరుప్పరంకుండ్రం కొండపై దీపం

తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఇవాళ దీపం వెలిగించనున్నారు. దీపం వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొండను CRPF ఆధీనంలోకి తీసుకోవాలని, అక్కడి దర్గా చుట్టూ 50 మీటర్ల ప్రాంతాన్ని సంరక్షిస్తూ, దర్గాకు వెళ్లే ఏ వ్యక్తీ ప్రభావితం కాకుండా చూడాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించనున్న దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు పర్యవేక్షించనున్నారు.