హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్ కెప్టెన్సీపై గుర్నూర్ బ్రార్ ప్రశంసలు

భారత కెప్టెన్ గిల్ నాయకత్వంపై యువ పేసర్ గుర్నూర్ బ్రార్ ప్రశంసలు కురిపించాడు. గిల్ బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తారని, ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపాడు. చిన్నప్పటి నుంచి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పాడు. టెస్టుల్లో అతడిలా రాణించాలనేది తన లక్ష్యమని వెల్లడించాడు. NZతో రెండో టెస్టులో తొలి వికెట్ తీయడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నాడు.