హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

BPT: భట్టిప్రోలు మండల పరిధిలోని రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఏకగ్రీవమైన పంచాయతీలను మినహాయించి, మిగిలిన అన్ని కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన వసతులను కల్పించారు. మండల పరిధిలో మొత్తం 142 పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు అందుబాటులో ఉంచారు.  విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇచ్చి, బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేయనున్నారు.