హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ASR: చింతపల్లి మండలంలో చలి పులి పంజా విసిరింది. శనివారం చింతపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.5డిగ్రీలకు పడిపోయిందని అధికారులు తెలిపారు. గత 4రోజులుగా 13-17డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సింగిల్ డిజిట్‌కు చేరాయి. ఈ ఏడాది తొలిసారిగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10డిగ్రీలలోపు నమోదయ్యాయి. చింతపల్లి, లంబసింగి, చెరువులవేనం ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది.