హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విదేశీ విద్య పేరుతో మోసం

ఎన్టీఆర్: విజయవాడకు చెందిన వ్యక్తిని అమెరికాలో ఎంఎస్సీ అగ్రికల్చర్ అడ్మిషన్, వీసా పేరుతో ఓ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. డబ్బులు వసూలు చేయడంతో పాటు, ఆయన వివరాలతో నకిలీ అనుభవ ధ్రువపత్రాలు, ఇతర పత్రాలు తయారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.