హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SKLM: ఆమదాలవలస పట్టణంలోని కొలువైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేకువ జామున స్వామివారికి ఆలయ అర్చకులు చైతన్య శర్మ విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని తులసి దళాలు, పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. పరిసర ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.