హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం!

W.G: పడాల మార్కెట్ యార్డులో శనివారం పోలింగ్ సామగ్రి పంపిణీ చేయనున్నట్లు MPDO వి. చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. ఈ నెల 29న జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు 564 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. ఐదు పంచాయతీలు, 106 వార్డులు ఏకగ్రీవం కాగా, 22 సర్పంచ్, 178 వార్డు పదవులకు పోలింగ్ జరగనుంది.