హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి దుర్మరణం

VZM: ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎస్సై నవీన్ పడాల్ వివరాల ప్రకారం.. జామి మండలం పావాడకు చెందిన ఏ. వెంకటరావు (56) ఎస్.కోటలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ తిరగబడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.