హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా!

CTR: అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 9 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా వెదురుకుప్పంలో 55.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంగవరంలో 10.4, నిండ్రలో 8.4, తవణంపల్లిలో 5.0, పలమనేరులో 2.2, కుప్పంలో 2.2, కార్వేటినగరంలో 1.2, పెద్దపంజాణిలో 1.0, చిత్తూరు అర్బన్‌లో 0.2 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.