హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిటాల వర్గీయులపై తోపుదుర్తి విమర్శలు

ATP: రాప్తాడు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ ఆరోపించారు. జిల్లాలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సునీత వర్గీయులు కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని విమర్శించారు. వైసీపీ మద్దతు మహిళా సర్పంచ్ అభ్యర్థిని దూషించి, బెదిరించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.