హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

PPM: సీతానగరంలోని జగ్గునాయుడుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు చల్లపల్లి శ్రీను (60), భార్య సింహాచలం (53), కుమారుడు రాజేశ్ (25)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.