హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో నవోదయ పరీక్ష!

ఏలూరు: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశానికి ఇవాళ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 22 కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు హాల్‌టికెట్లను నవోదయ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ వెంట తెచ్చుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది.