హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే

NLR: సర్వరాబాద్ సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే సురేష్ గుర్తించి వెంటనే స్పందించారు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.