కడప: సిద్ధవటం మండలం కనుమలోపల్లిలోని ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు 400 గ్రాముల బంగారు నగలు, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు రామకృష్ణారెడ్డి తెలిపారు. సుమారు రూ.50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. శుక్రవారం పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రూ.50 లక్షల చోరీ కలకలం.. రంగంలోకి క్లూస్ టీమ్


