కడప: పొరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పసుపులేటి ప్రసాద్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు. భారత సైన్యంలో నాయక్ హోదాలో సేవలందిస్తున్న ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. జవాన్ మృతిపట్ల గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్యాన్సర్తో పోరాడుతూ ఆర్మీ జవాన్ మృతి


