కృష్ణా: ఉయ్యూరు శివాలయం రోడ్డులో నాగళ్ల రాజేశ్వరమ్మ, జానకిరామయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఇందులో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం


