హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో అగ్రిగోల్డ్ వెరిఫికేషన్

KKD: అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల వద్ద ఉన్న పత్రాల పరిశీలన కాకినాడలో నిర్వహించనున్నారు. అమలాపురం, అయినవిల్లి మండలాలతో పాటు కాకినాడ జిల్లాలోని అన్ని మండలాల వారు స్థానిక పాత ఎస్పీ కార్యాలయం వద్ద హాజరుకావాలని సీఐడీ అధికారులు సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన జరుగుతుందని తెలిపారు. డిపాజిటర్లు లేదా వారి నామినీలు సంబంధిత పత్రాలతో రావాలని పేర్కొన్నారు.