హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పెద్దాపురం కౌన్సిల్ తొలి భేటీ

KKD: పెద్దాపురం పురపాలిక నూతన పాలకవర్గ తొలి సాధారణ సమావేశం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ రాజాసూరి బాబురాజు అధ్యక్షతన సమావేశం జరగనుంది. అజెండాలో పొందుపరిచిన 11 అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిల్ సభ్యులందరూ సమావేశానికి హాజరుకావాలని కోరారు.