హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమహేంద్రవరం నుంచి అరకు బస్సు సర్వీసు

E.G: అరకు వెళ్లే యాత్రికులు, ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం–అరకు సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును కొనసాగిస్తున్నట్లు DPTO మనోహర్ తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు రాజమహేంద్రవరం RTC ప్రధాన బస్టాండ్ నుంచి బయలుదేరి గోకవరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12 గంటలకు అరకుకు చేరుకుంటుందని వెల్లడించారు.