హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌గా తిమ్మరాజు ఏకగ్రీవ ఎన్నిక

SS: కె.గుండుమల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్టీ జనరల్ రిజర్వేషన్ కారణంగా సర్పంచ్ స్థానానికి తిమ్మరాజు నాయక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. గ్రామంలోని 10 వార్డుల సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపసర్పంచ్‌గా గుండుమల రామకృష్ణప్ప ఎన్నికయ్యారు.