E.G: రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తికి చెందిన కుడిచేయి గురువారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని రాజమండ్రి జీఆర్పీ ఎస్‌ఐ ఆదినారాయణ తెలిపారు. ఆ చేయి ఎవరిదనే వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. సంబంధిత సమాచారం తెలిసిన వారు జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తి చేయి


